ఏపీలో వైసీపీ నేతలు కాలకేయులుగా మారారు: వంగలపూడి అనిత - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో వైసీపీ నేతలు కాలకేయులుగా మారారు: వంగలపూడి అనిత

March 19, 2022

01

ఏపీలో వైసీపీ నేతలు కాలకేయులుగా మారి, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని టీడీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆమె జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో మచిలీపట్నంలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న నాగలక్ష్మి తనను వైసీపీకి చెందిన‌ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించ‌లేద‌ని పేర్కొన్నారు.

అంతేకాకుండా నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యే అని వంగలపూడి అనిత విమ‌ర్శించారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై ఆమె ఫిర్యాదు చేశార‌ని తెలిపారు. వైసీపీ పాల‌న‌లో మహిళలపై 1,500కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయ‌ని, వీటిపై ప్ర‌భుత్వం ఏ చర్యలు తీసుకుంటోందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకొచ్చిన‌ దిశ చ‌ట్టం కింద ఒక్క నేరస్థుడికైనా శిక్ష విధించారా? అని ఆమె ప్ర‌శ్నించారు.

ఏపీలో పెరిగిపోతోన్న దారుణాల‌కు ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని, మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంటే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని ఆమె నిల‌దీశారు. హోంమంత్రిగా ఓ మ‌హిళ ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయ‌ని వంగలపూడి అనిత మండిపడ్డారు.