కేసీఆర్ దగ్గర వైసీపీ నేతలు పాఠాలు నేర్చుకోవాలి..పవన్ కళ్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ దగ్గర వైసీపీ నేతలు పాఠాలు నేర్చుకోవాలి..పవన్ కళ్యాణ్

November 10, 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల్లో ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష నాయకులు, మాతృభాషా ప్రేమికులు భగ్గుమంటున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై ట్వీట్ చేశారు. 

తెలుగు మాధ్యమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ అధికారభాష సంఘం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. భాష మరియు సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో వైసీపీ నాయకత్వం తెలంగాణ సీఎం కేసీఆర్ నుండి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఈ సందర్బంగా 2017లో హైదరాబాద్‌లో జరిగిన ‘తెలుగు మహాసభలు’ పుస్తకం చూడాలన్నారు. దీనికి సంబందించిన ఫోటోను ట్వీట్ చేశారు. అలాగే పలు ట్వీట్లలో తెలుగుకు సంబంధించి ప్రముఖ రచయితలు రచించిన పుస్తకాలను పోస్ట్ చేశారు.