అయ్యప్ప మాల వేసుకొని ముస్లింల టోపీ, కండువా కప్పుకొని శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలో పర్యటించారు. దీనిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆక్షేపించారు. మత విశ్వాసాలను దెబ్బతీస్తున్న అనిల్ కుమార్ ని శబరిమలలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం కార్యకర్తలు అనిల్ ఇంటి ముందు ధర్నా చేసి రాళ్లదాడికి ప్రయత్నించారు.
దీనిపై మాజీ మంత్రి శనివారం స్పందిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. ‘నేను మందు తాగానా? మాంసం తిన్నానా? వేరే మతాలను గౌరవిస్తే తప్పెలా అవుతుంది. నన్ను విమర్శిస్తున్న నేతలకు అయ్యప్ప మాల అంటే తెలుసా? అయ్యప్ప మాలధారులు శబరిమల వెళ్లినప్పుడు ముస్లిం అయిన వావర్ స్వామిని దర్శించి అయ్యప్ప దర్శనానికి వెళ్తారు. నెల్లూరు రొట్టెల పండుగకు ఎంతమంది హిందువులు రావడం లేదు. అజ్మీర్ దర్గాకు ఎక్కువగా వెళ్లేది హిందువులే. మాలలో ఉన్నప్పుడు నమాజ్ టోపీ పెట్టుకోవద్దని ఏ శాస్త్రంలో ఉంది. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని దీక్షలోనే ఉంది. నేను చేసింది తప్పు కాదని ప్రజలకు, సమాజానికి తెలుసు’ అంటూ కౌంటరిచ్చారు.