'ఎమ్మెల్యే పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా?' - MicTv.in - Telugu News
mictv telugu

‘ఎమ్మెల్యే పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా?’

December 12, 2019

Ycp mla02

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర విద్యా వ్యవస్థకు సీఎం జగన్ శస్త్ర చికిత్స చేశారన్నారు. సమాజం మారాలంటే పాఠశాల విద్య నుంచే ఇంగ్లీష్ మీడియంలో బోధించాలని తెలిపారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించాల్సిన అవసరముందన్నారు. 

కార్మికుల పిల్లలకు కూడా అత్యున్నత విద్య అందాలనేది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. సాంకేతిక విద్యకు బలహీనవర్గాల పిల్లలు చేరువకావాలనేదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. రాజకీయ అవసరాల కోసం ఇంగ్లీష్ మీడియంపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుతున్నారా? అని ప్రశ్నించారు. మన పిల్లలకు చదువుతున్న చదువే అందరూ చదవాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను అందరం ఆహ్వానిద్దామని అన్నారు.