నేను ఎమ్మెల్యేనా? బంట్రోతునా?..అచ్చెన్నాయుడు - MicTv.in - Telugu News
mictv telugu

నేను ఎమ్మెల్యేనా? బంట్రోతునా?..అచ్చెన్నాయుడు

June 13, 2019

Ycp mla chevireddy called tdp mla accenaidu a servant of chandrababu naidu

 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. స్పీకర్‌గా తమ్మినేని సీతారం ఎన్నికైన తరువాత అభినందన తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో మైక్ తీసుకున్న వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఉద్దేశించి బంట్రోతు అని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

 

స్పీకర్‌ ఆస్థానంలో తమ్మినేని సీతారాంను కూర్చోబెట్టడానికి విపక్షం తరఫున చంద్రబాబు బంట్రోతు అచ్చెన్నాయుడు వచ్చాడని చెవిరెడ్డి వ్యాఖ్యానించాడు. దీనిపై అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేను బంట్రోతుగా సంబోధించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ… తాము ఎమ్మెల్యేలమో… బంట్రోతులమో తేల్చాలని స్పీకర్‌ను కోరారు. ఒకవేళ తాను చంద్రబాబుకు బంట్రోతునైతే… అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ సీఎం జగన్‌కు బంట్రోతులేనా.. ఆ విషయం స్పష్టం చేయాలని కోరారు.