YCP MLA chirla Jaggireddy Protest In Ravulapalem Police Station
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యే హల్‌చల్.. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే..

July 11, 2022

YCP MLA chirla Jaggireddy Protest In Ravulapalem Police Station

దళిత యువకులపై తప్పుడు కేసులు పెట్టారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. రాత్రి పోలీస్ స్టేషన్ లోనే నిద్రించారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేంత వరకూ తాను ఆందోళనను విరమించనని ఆయన చెబుతున్నారు. జగ్గిరెడ్డి ఆందోళనకు ఎంపీ చింతా అనూరాధ మద్దతు తెలిపారు. జగ్గిరెడ్డి అనుచరులు రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అంబేద్కర్ బొమ్మను ప్లేట్లుపై ముద్రించి అవమానపరిచారని.. ఇదేంటని ప్రశ్నించిన యువకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. వారిని జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. ఈ సంఘటనపై ఎలాంటి విచారణ చేపట్టకుండా 18మంది యువకులపై కఠినమైన కేసులు నమోదు చేయడంపై పోలీసుల తీరును తప్పుబట్టారు. ఎలాంటి విచారణ జరపకుండా అమలాపురం ఘటన తరహా సెక్షన్లతో కేసులు ఎందుకు పెట్టారని డీఎస్పీని జగ్గిరెడ్డి అడిగారు. అయితే, జగ్గిరెడ్డి నిరసన విరమించేలా పార్టీ అధినాయకత్వం మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోనసీమ జిల్లాతో పాటుగా వైసీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.