నడిరోడ్డుపై వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే వేడుకలు - MicTv.in - Telugu News
mictv telugu

నడిరోడ్డుపై వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే వేడుకలు

September 19, 2019

Ycp Mla

ఎవరైనా పుట్టినరోజును ఇతర శుభకార్యాలు ఏమైనా ఉంటే ఇంట్లోనే లేదా ఫంక్షన్ హాల్లోనో జరుపుతారు. కానీ పి. గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు కుమారుడు వికాస్ మాత్రం ఏకంగా చౌరస్తాలోనే తన పుట్టిన రోజు వేడుకలు ఏర్పాటు చేశాడు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రోడ్డుపై వేడుకలు ఏర్పాటు చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సుమారు 3 గంటల పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 

తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలోని చౌరస్తాలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. భారీగా వైసీపీ శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో ట్రాఫిక్ జాం ఏర్పండింది. అటుగా వెళ్లే దారిలేక నడిరోడ్డుపై నరకం చూశారు. మూడు గంటల పాటు రోడ్డుపైనే ట్రాఫిక్ నిలిచిపోయింది.ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. దీంతో స్థానికులు వికాస్ తీరుపై స్థానికులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కొడుకు అయినంత మాత్రాన నడిరోడ్డుపై ఈ వేడుకలు ఏంటని ప్రశ్నించారు.