గ్రామ వాలంటీర్ల చేతివాటంపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు  - MicTv.in - Telugu News
mictv telugu

గ్రామ వాలంటీర్ల చేతివాటంపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు 

February 17, 2020

fgngh

ఏపీ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పక్కాగా చేర్చేందుకు వాలంటీర్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాత పరీక్ష నిర్వహించి మరీ వీరిని ఎంపిక చేసి గ్రామాల్లో ప్రజలకు సేవలు అందించేలా చేశారు. వీరికి ప్రతి నెలా జీతాలను కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కార్ వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అలాంటి వారిపై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. లబ్దిదారుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. 

మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి  ఈ వ్యాఖ్యలు చేశారు.పేదల దగ్గర కొంత మంది వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తోన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.  అంతటితో ఆగకుండా వాటిలో కొంత భాగం రాజకీయ నేతలకు కూడా వసూలు చేసి ఇస్తున్నట్టుగా ఆరోపించారు. ప్రతి నెల జీతాలు తీసుకుంటూ కూడా డబ్బులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇష్టం లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని సూచించారు. పేద ప్రజల నుంచి లంచాలు తీసుకుంటే మాత్రం సహించేది లేదని కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడంతో ఇది సంచలనంగా మారింది. 

కాగా గతంలోనూఇలాంటి ఆరోపణలు వచ్చిన వారిలో కొంతమందిని వాలంటీర్లుగా తప్పించారు. తాజాగా ఎమ్మెల్యే ఈ డబ్బులు నేతలకు కూడా వాలంటీర్లు వసూలు చేసి ఇస్తున్నారంటూ చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది.