1998 డీఎస్సీకి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

1998 డీఎస్సీకి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే

June 21, 2022

1998లో రాసిన డీఎస్సీపై వివాదం రాగా, ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకంతో అభ్యర్ధులందరికీ ఉద్యోగాలు రానుండడం తెలిసిందే. అయితే చాలా మంది అభ్యర్ధులు ఇప్పటికే వివిధ వృత్తులలో సెటిలయిపోయారు. కొందరు కూలీ నాలీ చేసుకుంటుండగా, శ్రీకాకుళంలో అయితే ఓ అభ్యర్ధి ఏకంగా బిచ్చగాడిగా మారిపోయారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘మద్రాసు అన్నామలై యూనివర్సిటీ నుంచి బీఈడీ చేశాను. టీచరుగా స్థిరపడాలనే ఉద్దేశంతో 30 సంవత్సరాల వయస్సులో 98 డీఎస్సీ రాశాను. తీరా అది వివాదాస్పదం కావడంతో బీఎల్ చదివాను. అదే సమయంలో రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లా యువజన సంఘంలో పనిచేశాను. తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభావంతో అలాగే రాజకీయాల్లో కంటిన్యూ అయిపోయాను. ఒకవేళ అప్పుడే ఉద్యోగం వచ్చి ఉంటే టీచరుగానే ఉండిపోయేవాడిని’ అని అభిప్రాయపడ్డారు.