వివేకా హత్య కేసులో సీఎం జగన్ పై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా చనిపోతే జగన్ కు ఏమైనా ఆస్తి లభించిందా? అని ప్రశ్నించారు. ఆస్తులన్నీ వివేకా భార్య, కుమార్తె, అల్లుడి పేర్ల మీదే బదలాయించారని వివరించారు. వివేకా బతికున్నా ఆ సీటును అవినాశ్ రెడ్డికే ఇచ్చేవారని స్పష్టం చేశారు.
‘వివేకానందరెడ్డి బతికున్నా, చనిపోయినా జగన్.. కడప ఎంపీ సీటును అవినాష్ రెడ్డికే ఇచ్చేవారు. ఎందుకంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేస్తే… వివేకానంద రెడ్డి, ఆయన కుటుంబం జగన్ ప్రత్యర్థి పార్టీ తరపున నిలిచి విజయమ్మని ఓడించడానికి, సర్వనాశనం చేయడానికి ప్రయత్నించారు. కానీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటి ఉండి ఆయన విజయం కోసం పాటుపడ్డారు. కాబట్టి వారికే జగన్ సీటిస్తారు. అది జగన్ ఇష్టం’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు.
‘కుక్కకాటుకు చెప్పుదెబ్బలా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు పచ్చమీడియాకి జగనన్న అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో ఎలా మభ్యపెట్టాడో కూడా చెప్తాం. రాష్ట్రంలో దోచుకున్న డబ్బును అతని వాళ్లకు ఎలా పంచిపెట్టాడు అనేది కూడా వివరిస్తాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇంకా ఐటీ నావల్లే వచ్చిందని చంద్రబాబు చెబితే ఎవరూ నమ్మరు. చెత్త పుస్తకాలు వేస్తే ఎవడు చూస్తాడు.. అవి చలిమంట వేసుకోడానికి కూడా పనికిరావు. “ఎన్టీఆర్‌ని తడిగుడ్డతో గొంతు ఎలా కోశారు..” అన్నది రాయమనండి. తండ్రికి వెన్నుపోటు పొడుస్తుంటే చూసి.. ఆనందించింది ఎవరు..? అనేది పుస్తకాలు వేయాల్సింది. మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. టీడీపీని లాక్కున్నాడు. దేనికీ పనికి రాని పప్పుగాడిని ఓ నాయకుడిలా ప్రజల మీదకు వదిలాడు..’ అంటూ నాని కామెంట్స్ చేశారు.