YCP MLA Kodali Nani Mass warning Purandeswari
mictv telugu

పురంధేశ్వరి పిచ్చి పనులు మానుకో.. కొడాలి నాని వార్నింగ్

June 13, 2022

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నాని ఆరోపించారు. గుడివాడకు మంజూరైన ఫ్లై ఓవర్లను కేవలం 10 మంది వ్యాపారుల కోసం పురంధేశ్వరి అడ్డుకోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషితో మంజూరైన ఫ్లైఓవర్లను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం ఫ్లైఓవర్ల నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్ మెంట్‌ను పురందేశ్వరి అడిగారని అన్నారు. ఫ్లైఓవర్‌ నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటామని, పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో మంజూరైన ఫ్లైఓవర్ల ను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.