పవన్ బెత్తం దెబ్బల వ్యాఖ్యలపై రోజా సెటైర్..వద్దన్న స్పీకర్ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ బెత్తం దెబ్బల వ్యాఖ్యలపై రోజా సెటైర్..వద్దన్న స్పీకర్

December 9, 2019

YCP MLA Roja.

ఏపీ అసెంబ్లీలో మహిళా రక్షణపై సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ, జనసేనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది నేతలు మహిళలను కించపరిచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అత్యాచార ఘటనలు జరిగినప్పుడు కఠిన శిక్షలు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తుంటే పవన్ కల్యాన్ మాత్రం రెండు బెత్తం దెబ్బలు చాలంటూ వ్యాఖ్యానించారని ఆమె సభలో గుర్తు చేశారు. 

ఈ సందర్భంగా పవన్‌పై ఆమె సైటర్లు వేశారు. రెండు చోట్లా ఓడిపోయిన ఏకైక పార్టీ అధినాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే కల్పించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం తెలిపారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదని చెప్పారు. వెంటనే సవరించుకున్న ఎమ్మెల్యే రోజా వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. జనసేన ఎమ్మెల్యే ద్వారా ఆయనకు తెలియజేయాలని కోరుతున్నట్టు చెప్పారు.