కలెక్టర్ విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

కలెక్టర్ విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే

November 26, 2019

వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆమె కుల ధృవీకరణ తప్పంటూ ఫిర్యాదులు రావడంతో ఈసీ విచారణకు ఆదేశించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జేసీ దినేష్ కుమార్‌ను కలిసి తన వద్ద ఉన్న ధృవీకరణ పత్రాలు సమర్పించారు. స్టడీ సర్టిఫికెట్స్, మూడు తరాలకు సంబంధించిన కుల పత్రాలు ఇచ్చారు. వాటిని తీసుకున్న జేసీ అన్నింటిని స్పష్టంగా పరిశీలించి తర్వాత పిలుస్తామని చెప్పారు.

YCP MLA Sridevi.

అనంతరం ఆమె మాట్లాడుతూ..‘నేను పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను ఎప్పుడైనా విచారణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు అవినీతిపై పోరాటం చేస్తున్నాననే కుట్రలో భాగంగానే నన్ను కేసులో ఇరికించాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. కాగా తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్ని రోజుల క్రితం ఆమె ఓ ఇంటర్వ్యూలో తన భర్త కాపు సామాజిక వర్గం అని తాను క్రిస్టియన్ అంటూ పేర్కొన్నారు. మతం మారడం వల్ల చట్టం ప్రకారం ఆమెకు ఎస్సీ కులం వర్థించదని దీనిపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులు రాష్ట్రపతి కార్యాలయానికి చేరాయి. వెంటనే దీనిపై విచారణ జరిపేందుకు ఆదేశాలు వచ్చాయి.