టీడీపీ వాళ్లు ‘సిగ్గులేదా’ అని ఎగతాళి చేస్తున్నారు. అయినా పర్లేదు : వైసీపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీ వాళ్లు ‘సిగ్గులేదా’ అని ఎగతాళి చేస్తున్నారు. అయినా పర్లేదు : వైసీపీ ఎమ్మెల్యే

April 14, 2022

bfrf

ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తమ ప్రభుత్వంపై ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. రూ. 200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, నాయకులను చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. రెండున్నర కోట్ల రూపాయల పనులు చేసిన మైలవరం పంచాయితీ ఉప సర్పంచ్ సీతారెడ్డి తనకున్న ఐదెకరాల మామిడితోటను అమ్ముకున్నారని అన్నారు. విషయం తనకు తెలిసి క్షమించమని వేడుకున్నానన్నారు. అయితే సొంతూరిపై మమకారంతోనే సొంత నిధులను ఖర్చు చేశానని సీతారెడ్డి చెప్పినట్టు తెలిపారు. ఈ విషయంపై ప్రతిపక్ష టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ సిగ్గులేదా? అని ఎగతాళి చేశాడని వాపోయారు. అయినా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందనీ , కాబట్టి సిగ్గుపడాల్సిందేమీ లేదని కృష్ణప్రసాద్ సర్ది చెప్పుకున్నారు.