వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.. అప్పు చెల్లించడం లేదని.. - MicTv.in - Telugu News
mictv telugu

వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.. అప్పు చెల్లించడం లేదని..

September 14, 2020

YCP MLA Undavalli Sridevi Allegations .

వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తనను ఎమ్మెల్యే మోసం చేసిందని మేకల రవి అనే వ్యక్తి ఆరోపించాడు. ఎన్నికల సమయంలో తీసుకున్న అప్పుు చెల్లించడం లేదని వాపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో విడుదల చేశాడు. తనను సీఎం జగన్ ఆదుకోవాలని కోరాడు. రూ. 1.40  తీసుకొని రూ.40 లక్షలు చెల్లించి మిగితా డబ్బు అడిగేతే బెదిరిస్తోందని చెప్పాడు. దీంతో ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. 

ఎన్నికల ముందు శ్రీదేవి తన వద్దకు వచ్చి డబ్బు సాయం కోరిందని చెప్పాడు. డబ్బు ఇవ్వడంలో తన భర్త మోసం చేశాడని రూ. 1.40 సర్ధుబాటు చేయాలని కోరిందన్నాడు. తీరా కొంత చెల్లించి మిగితా రూ. 80 లక్షలు అడిగితే బెదిరిస్తోందని వాపోయాడు. డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు లెక్క సరిపోయింని చెబుతోందన్నాడు. మాట వినకపోతే పోలీసులతో అరెస్టు చేయిస్తానని బెదిరిస్తోందని తెలిపాడు. డబ్బుల కోసం ఇంటికి వెళితే తనను దుర్భాషలాడిందని వెల్లడించాడు. సాటి దళితుడిపై ఇలా చేయడం ఏంటని ప్రశ్నించాడు. ఎమ్మెల్యే శ్రీదేవి అరాచకాలపై జగన్ దృష్టి పెట్టాలని కోరాడు. లేకపోతే తాను ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని వాపోయాడు. అయితే ఆ ఆరోపణలను శ్రీదేవి అనుచరులు కొట్టిపడేస్తున్నారు. ఇచ్చినట్టుగా ఏదైనా ఆధారాలు ఉంటే తీసుకురావాలని సవాల్ చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా తమ నాయకురాలిపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.