సోఫాకు రిబ్బన్ కట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.. ట్రోల్ చేస్తున్న టీడీపీ - MicTv.in - Telugu News
mictv telugu

సోఫాకు రిబ్బన్ కట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.. ట్రోల్ చేస్తున్న టీడీపీ

April 23, 2022

ఏపీలో రెండు రాజకీయపార్టీలైన వైసీపీ, టీడీపీలు రెండూ ఛాన్స్ దొరికితే ఒకరిమీద మరొకరు విరుచుకుపడతారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే విషయంలో అది మరింత దారుణంగా ఉంటుంది. ఈ విషయంలో ఒక్కో పార్టీ ఒక్కో సమయంలో పైచేయి సాధిస్తుంటుంది. తాజాగా దొరికిన ఓ ఫోటో చూస్తుంటే ఇప్పుడు అవకాశం టీడీపీకి దక్కినట్టు భావించక తప్పదు.

శనివారం తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓ సోఫాసెట్‌కు రిబ్బన్ కట్ చేస్తున్నారు. దీనిని షేర్ చేస్తూ.. ‘గొప్ప ప్రారంభోత్సవం, సోఫాసెట్ ప్రారంభించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు’అని వ్యంగ్యంగా క్యాప్షన్ పెట్టారు.