వైసీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం.. నీళ్లు నమిలిన కలెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం.. నీళ్లు నమిలిన కలెక్టర్

April 4, 2022

hdfb

ఏపీలో ఇవ్వాళ్టి నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నంద్యాలలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ విషయంపై వైసీపీ ఎమ్మెల్యేలు కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జిల్లా శిలాఫలకంపై తమ పేర్లు లేవంటూ మండిపడ్డారు. నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న శ్రీశైలం, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగానపల్లె, డోన్, నంద్యాల నియోజకవర్గాలున్నాయి. జిల్లాల ప్రారంభోత్సవానికి నియోజక వర్గ ఎమ్మెల్యేలందరినీ జిల్లా కలెక్టర్ జిలానీ ఆహ్వానించారు. అయితే శిలాఫలకంపై డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్ రెడ్డిల పేర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలెక్టర్‌ను నిలదీశారు. తమ పేర్లు ఎలా మిస్సయ్యాయో తెలపాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఇలా గట్టిగా నిలదీయడంతో కలెక్టర్ ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నమిలారు.