బ్లాక్ మెయిల్ చేశాడు, చంపేశా.. వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ - MicTv.in - Telugu News
mictv telugu

బ్లాక్ మెయిల్ చేశాడు, చంపేశా.. వైసీపీ ఎమ్మెల్సీ అనంత్

May 23, 2022

డ్రైవరు సుబ్రమణ్యం హత్య కేసులో మొదట అబద్ధమాడిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎట్టకేలకు పోలీసుల విచారణలో నిజాలు మాట్లాడాడు. తన వ్యక్తిగత విషయాలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేయడంతో ఆవేశంలో కొట్టానని పేర్కొన్నాడు. మొదట అతడిని చంపాలనుకోలేదని, దెబ్బలు కొట్టి భయపెడదామనుకున్నట్టు తెలిపాడు. అయితే ఆవేశంతో కొట్టడంతో దెబ్బలకు తాళలేక చనిపోయినట్టు వివరించాడు. అంతేకాక, హత్య సమయంలో ఎవరూ లేరని తానొక్కడే ఈ పని చేసినట్టు పోలీసులు విచారణలో అసలు నిజం చెప్పేశాడు.

కాగా, అనంతబాబు ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్నట్టు కాకినాడ ఏఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా, పోలీసు విచారణలో నిజం ఒప్పేసుకోవడంతో అతడిని జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కోర్టు సమయం అయిపోవడంతో జడ్జి ఇంటికి తీసుకెళ్లనున్నారు. ఇందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. దానికంటే ముందు వైద్య పరీక్షలు చేయిస్తారు.