ఇటీవల సంచలనం సృష్టించిన డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అనంతబాబు తోటి ఖైదీపై చెయ్యి చేసుకున్నారు.
తోటి ఖైదీతో మాటామాటా పెరగడంతో ఘర్షణ జరగ్గా.. ఎమ్మెల్సీ కోపంతో చేయి చేసుకున్నారు. అయితే పెద్ద దెబ్బలు ఏం తగల్లేదని సమాచారం. కాగా, ఎమ్మెల్సీకి బయటి నుంచి భోజనం వస్తుందని, జైల్లో పరుపు కూడా ఏర్పాటు చేశారని విశ్వసనీయ సమాచారం. ఇదికాక, పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను నిత్యం జైలుకెళ్లి కలుస్తున్నారంట. వారిలో రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంపై జైలు సూపరింటెండెంట్‌ను వివరణ కోరాలని ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.