YCP MLC CHALLA BHAGIRATHA REDDY DIED
mictv telugu

వైసీపీ ఎమ్మెల్సీ కన్నుమూత

November 2, 2022

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. చల్లా భగీరథ రెడ్డిని రక్షించేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.46 ఏళ్లకే ఆయన మరణించడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భగీరథ రెడ్డి మృతిపట్ల వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. అంత్యక్రియలను గురువారం కర్నూలు జిల్లా అవుకులో నిర్వహించనున్నారు.

చల్లా భగీరథ రెడ్డి దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో ఆయన కుమారుడు భగీరథ రెడ్డికి సీఎం జగన్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. భగీరథ రెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2019లో తండ్రితో కలిసి వైసీపీలో చేరారు.