అచ్చెన్నాయుడిని ‘అంకుశం’లా కొడతా : వైసీపీ ఎమ్మెల్సీ - MicTv.in - Telugu News
mictv telugu

అచ్చెన్నాయుడిని ‘అంకుశం’లా కొడతా : వైసీపీ ఎమ్మెల్సీ

May 30, 2022

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోమవారం టీడీపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం ఆత్మాహుతి దళంగా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. ఒంగోలులో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సహా టీడీపీ నేతలు సీఎం జగన్‌పై విమర్శలు చేయడం తెలిసిందే. దీనికి బదులుగా ఎమ్మెల్సీ స్పందించారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా టెక్కలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని టార్గెట్ చేశారు. హీరో రాజశేఖర్ నటించిన సూపర్ హిట్ చిత్రం అంకుశంలో విలన్‌ని కొట్టినట్టు నడిరోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తానని హెచ్చరించారు. రాజకీయంగా అచ్చెన్నాయుడి అంతు చూస్తానని, జగన్ కోసం ఎంతకైనా తెగిస్తానని తీవ్ర ప్రతిజ్ఞ చేశారు. జీవితం మీద, ప్రాణం మీద ఆశలేని వ్యక్తినని, ఈ విషయాన్ని గుర్తెరిగి టీడీపీ నేతలు మసలుకోవాలని సూచించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, ఒక్కొక్కరి తాట తీస్తానని మండిపడ్డారు.