తాను తలచుకుంటే హీరోగా 10 సినిమాల్లో నటించగలనని, సూపర్ స్టార్ అవ్వగల సత్తా తనకు ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్. తాను సినిమాలు చేస్తే జనాలు ఆదరిస్తారని, తనకు ఉన్న ఫేస్ గ్లామర్ అటువంటిదని చెప్పారు. అవసరమైతే సీఎం జగన్ అనుమతి తీసుకొని పది సినిమాల్లో హీరోగా చేయగలనని అన్నారు. సడెన్‌గా ఆయన ఈ కామెంట్స్ చేయడానికి మెయిన్ రీజన్ మరో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు. ఓ ప్రెస్ మీట్‌లో రఘురామ కృష్ణ రాజు.. మార్గాని భరత్‌ను ఏకచిత్ర నటుడు అని సంబోధించారు. దీన్ని భరత్ తీవ్రంగా తప్పుబట్టారు.
తాను హీరోగా చేసే సినిమాల్లో కావాలంటే రఘురామ కృష్ణరాజుకు కమెడియన్ పాత్ర ఇస్తానని అన్నారు. అరిటాకు గోచీ కట్టుకొని ఆయన కంటే పెద్ద కమెడియన్ ఎవరుంటారంటూ ఆయన ఎద్దేవా చేశారు. రఘురామ కృష్ణంరాజు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. ఆయన కామెడీ యాక్టర్‌కు తక్కువ.. పనికిమాలిన యాక్టర్‌కు ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. మార్గాని భరత్‌కు గతంలో సినిమాలో నటించిన అనుభవం ఉన్న సంగతి తెలిసిందే.