YCP MP Gorantla Madhav challenged Chandrababu
mictv telugu

ఆ పని నేను చేస్తా.. నువ్వు చేయగలవా? చంద్రబాబుకు గోరంట్ల సవాల్

August 19, 2022

YCP MP Gorantla Madhav challenged Chandrababu

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా ప్రతిపక్షాలు చెప్తున్న న్యూడ్ వీడియోపై ఆ రాష్ట్రంలో ఇంకా దుమారం రేగుతూనే ఉంది. రెండు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఫేక్ ఫోరెన్సిక్ సర్టిఫికెట్‌తో టీడీపీ దొరికిపోయిందని, తనను అడ్డం పెట్టుకొని మరోసారి ముఖ్యమంత్రి కావాలనే కుట్రకు చంద్రబాబు తెరలేపారని దుయ్యబట్టారు.

ఓటుకు నోటు కేసు విషయంలో ఇప్పటివరకు నోరు మెదపని చంద్రబాబు తనపై అకారణంగా నింద మోపుతున్నారని విమర్శించారు. ఆ వీడియో నాది కాదని కాణిపాకం గణపతి ముందు ప్రమాణం చేస్తా.. బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ మీది కాదని ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. అలాగే గతంలో మహిళల గురించి బాలయ్య అన్న మాటలు, లోకేష్‌ ఫోటోల అంశం గురించి ప్రశ్నించారు. టీడీపీ, అనుకూల మీడియా ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి గెలిచేది నేనే అనే నమ్మకం వెలిబుచ్చారు. బీసీ మంత్రినైన తనను టార్గెట్ చేసి చేస్తున్న వేధింపులను బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలు గమనించాలని కోరారు.