నా విందు.. నా ఇష్టం.. వైసీపీ ఎంపీ వ్యాఖ్య - MicTv.in - Telugu News
mictv telugu

నా విందు.. నా ఇష్టం.. వైసీపీ ఎంపీ వ్యాఖ్య

December 12, 2019

YCP MP 01

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విందు రాజకీయ ప్రకంపనలు రేపింది. ఎంపీలందరికీ ఆయన బుధవారం రాత్రి ప్రత్యేకంగా విందు ఇచ్చారు. దీనికి 300 మంది వరకు ఎంపీలు హాజరయ్యారు. ప్రధానంగా కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ వచ్చారు. ప్రత్యేకమైన వంటకాలతో న్యూ ఎంపీ క్వార్టర్స్‌లోని వెస్ట్రన్ కోర్టులో ఈ విందు ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ ఎంపీలు ఎవరూ ప్రత్యేకంగా కేంద్ర మంత్రులను, ఢిల్లీ పెద్దలను కలవకూడదని ఇంతకు ముందే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నర్సాపురం ఎంపీ ఏర్పాటు చేసిన విందు ఆసక్తిగా మారింది.  

ఈ విందు ఏర్పాటుపై ఆయన పార్టీ అధినాయకత్వానికి చెప్పారా అంటూ పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ అధ్యక్షుడి హోదాలో నేను ఇస్తున్న విందు ఇది. నా విందు.. నా ఇష్టం.. నేను ఎవరికి చెప్పాల్సిన పనిలేదు. మా పార్టీ ఎంపీలకు ప్రత్యేకించి ముందుగానే ఆహ్వానం పలికాను. ఇదేం సిక్రెట్‌గా జరుగుతున్న విందు కాదు. నేను గతంలో ఎన్నో విందులకు వెళ్లాను. అప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోలేదు. నేను విందు ఇచ్చే సమయంలో ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన పనేముందని ప్రశ్నించారు.