YCP MP Mithun Reddy acted as Lok Sabha Speaker
mictv telugu

లోక్‌సభ స్పీకర్ కుర్చీలో కూర్చున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

August 2, 2022

ఏపీలో అధికార వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మంగళవారం లోక్ సభ స్పీకరు కుర్చీలో కూర్చున్నారు. ప్యానెల్ స్పీకరుగా వ్యవహరిస్తున్న మిథున్ రెడ్డి.. సభలో స్పీకరు, డిప్యూటీ స్పీకరు అందుబాటులో లేనప్పుడు కాసేపు స్పీకరుగా వ్యవహరించారు. పార్లమెంటరీ కార్యక్రమాలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఆయా పార్టీల సభ్యులకు ఇలాంటి అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల తర్వాత లోక్ సభ సెక్రటేరియట్ ప్యానెల్ స్పీకర్లను ఎంపిక చేసింది. ఆ జాబితాలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో లోక్‌సభ స్పీకరుగా కాసేపు మిథున్ రెడ్డికి అవకాశం లభించింది. ఈ సందర్భంగా కుర్చీలో కూర్చున్న ఫోటోను మిథున్ రెడ్డి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ అవకాశం దక్కడం గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు.