వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనను రాజ్యసభ వైస్ చైర్మెన్ ప్యానెల్ నుంచి తప్పిస్తూ రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కడ్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. మంగళవారమే ఈ ప్యానెల్ లో 8 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. అయితే ఈ రోజు ప్యానెల సభ్యుల జాబితాలో విజయసాయిరెడ్డి కాకుండా ఏడుగురు పేర్లే చదివారు. ఆయనను తొలగించినట్టు రాజ్యసభ చైర్మెన్ వెల్లడించారు. కానీ, అందుకు గల కారణాలు తెలియరాలేదు. కేవలం ఒక్కరోజులోనే విజయసాయి విశిష్ట పదవిని కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. అటు రాజ్యసభ చైర్మెన్ ప్రకటించిన ఏడుగురు వ్యక్తులలో సురేంద్ర సింగ్ నాగర్, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్ రే, డాక్టర్ ఎల్. హనుమంతయ్య, డాక్టర్ సస్మిత్ పాత్రా, భుభనేశ్వర్ కలిటా, సరోజ్ పాండేలు ఉన్నారు.