వైసీపీ నేతల విమర్శలకు మరోసారి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి కౌంటరిచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫోన్ ట్యాపింగ్ అంటే అషామాషీ కాదన్నారు. అది ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జరిగిందన్నారు కోటం రెడ్డి. అనుమానించిన చోట ఉండకూడదని ఆలోచించి అధికారాన్ని వదులుకున్నట్లు చెప్పారు. తన గొంతును ఆపాలంటే ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే మార్గమన్నారు. తాను చచ్చిపోతేనే తన మాటలు ఆగుతాయని వెల్లడించారు. కేసులు పెట్టి..జైల్లో పెట్టి మీరు అలసిపోవాలి తప్ప తన గొంతు ఆగే ప్రస్తకి లేదని స్పష్టం చేశారు.
సజ్జలపై ఫైర్
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కోటంరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇసుకాసురులు, మద్యం వ్యాపారుల ఆడియోలు రిలీజ్ చేస్తే.. మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుందన్నారు. తన అరెస్టుకు రంగం సిద్ధం అని లీకులు ఇస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. ఏ నిమిషమైనా తనను అరెస్టు చేసుకోండని సవాల్ చేశారు.చివరగా.. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుందని పేర్కొన్నారు.
అనిల్ మాటలు బాధించాయి
తనపై తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ మాటలు బాధించాయని చెప్పారు .అనిల్ కుటుంబం వేరని ఎప్పుడూ అనుకోలేదని కోటంరెడ్డి తెలిపారు. గతంలో అనిల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే తన కుటుంబం అల్లాడిందని చెప్పారు. గతంలో చంద్రబాబును అనిల్ ఎందుకు కలిశారని ప్రశ్నించారు. బెంజ్ కారులో వెళ్లి కలిస్తే అప్పుడు నిఘా ఏమైందన్నారు కోటం రెడ్డి.
మోసం చేయలేదు
“నేడు జగన్‌ను నమ్మకద్రోహం చేసి ఉంటే.. తనను సర్వనాశనం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తప్పు చేయకుండా ఉంటే దేవుడు తనకు అండగా ఉంటాడు. నా మనస్సు విరగడంతో బయటకు వచ్చాను. ప్రాణాతిప్రాణంగా ఆరాధించనా జగన్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ గురైందన్న ఆరోపణలు తట్టుకోలేపపోయాను. అందుకే ముందే బయటకు వచ్చా..ఆఖరిదాకా ఉండి మోసం చేయలేదు” అని కోటం రెడ్డి వ్యాఖ్యానించారు.