ఆత్మకూరులో వైసీపీ భారీ గెలుపు.. డిపాజిట్ దక్కని ప్రత్యర్ధులు - MicTv.in - Telugu News
mictv telugu

ఆత్మకూరులో వైసీపీ భారీ గెలుపు.. డిపాజిట్ దక్కని ప్రత్యర్ధులు

June 26, 2022

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రం రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్ధి బీజేపీ భరత్ కుమార్ 19352 ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు. మేకపాటి విక్రం రెడ్డికి మొత్తం 102240 ఓట్లు వచ్చాయి. మొదటినుంచి ఆధిక్యంలో ఉన్న విక్రం రెడ్డికి భరత్ కుమార్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. ఇక పోస్టల్ బ్యాలెట్‌లోనూ వైసీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకుంది. 205 ఓట్లకు గాను, 167 ఓట్లను వైసీపీ సాధించింది. కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. మొత్తం 14 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.