తెలంగాణ కవి, గాయకుడు ఏపూరి సోమన్నకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసులు సంకెళ్లు వేశారు. చేతులకు బేడీలు వేసి పోలీసు స్టేషన్ లోని లాకప్ కు కట్టేశారు. టెర్రరిస్టులను బంధించినట్లు స్టేషన్ లో బంధించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఒక ప్రజా కళాకారునిపై పోలీసుల ప్రవర్తనపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరెస్ట్ కు గల కారణం ఏందంటే …
ఏపూరి సోమన్నకు గత మూడు, నాల్గు ఏండ్లుగా కుటుంబ కలహాల నేపథ్యంలో కేసులు ఉన్నాయి..ఆవిషయమై అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు.అయితే ఇందులో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం భార్య పుష్ప స్టేషన్ కు వచ్చి ఏపూరి సోమన్నను పలు ప్రశ్నలు వేయడంపై అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తన అరెస్ట్ పై ఏపూరి సోమన్న ఏమన్నాడంటే ….
గత కొంతకాలంగా తెలంగాణ సర్కారు వైఫల్యాలను, కుటంబ పాలనను తన పాట, మాట, రాతలతో ఎండగడుతున్నందుకే నాపై ప్రభుత్వం కక్ష గట్టింది, అందుకే కుటుంబ కలహాల వంకతో నన్ను నాశనం చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారు. నిజంగా ఎమ్మెల్యే భార్య పుష్ఫ కు మాకుటుంబం మీద అంత ప్రేముంటే..నన్ను నాభార్యను మాకుటుంబాన్ని ఇంట్లో కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చెయ్యచ్చు,కానీ నా కుటుంబ కలహాలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ మెప్పుకోసం వీళ్లందరూ నామీద కక్ష గట్టారు.
ప్రభుత్వంనుంచి ,నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం భార్య పుష్ప నుంచి నాకు త్రెట్ ఉంది 2019 వరకు నన్ను చంపేస్తారు …ఇది నావ్యక్తిగత విషయం నాకుటుంబ పరిస్థితులను నేను చక్కదిద్దికోగలను, నా ఊపిరున్నంత వరకు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడతా,వీన్ని ఎలాగైనా జీరో చెయ్యాలని ప్రభుత్వ కుట్ర పన్నుతుంది… ప్రజా గాయకుడు అన్న బిరుదు ముందు పదవులు అనేటివి నాకాలి గోటితో సమానం. అని సోమన్న ఓ ఛానల్ ద్వారా ఫోన్ లో మాట్లాడారు.