Yes..even if the offer of the film was dropped: Sudhir Babu
mictv telugu

‘బ్రహ్మాస్త్ర’ ఆఫర్‌ను వదులుకున్నా..టాలీవుడ్ హీరో

September 17, 2022

”అవును..నాకు బ్రహ్మాస్త్ర మూవీ ఆఫర్ వచ్చింది. కానీ, అప్పటికే నేను తెలుగులో పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను. అందుకే బ్రహ్మాస్త్రలో నటించలేనని చెప్పేశాను. అదే కారణం అంతకు మించి ఏం లేదు” అని టాలీవుడ్ హీరో సుధీర్ బాబు అన్నారు. తాజాగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. అనే చిత్రంలో సుధీర్ బాబు హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విషయాలను పంచుకున్నారు.

 

ఇక, హీరో సుధీర్ బాబు విషయానికొస్తే.. తెలుగులో ‘ఏ మాయ చేశావే’ చిత్రంలో హీరోయిన్‌కు బ్రదర్ క్యారెక్టర్ ద్వారా ప్రేక్షకులు పరిచయం అయ్యారు. ఆ తర్వాత హీరోగా ఆయన ‘ప్రేమకథా చిత్రమ్’,’ ఆడు మగాడ్రా బుజ్జీ’, ‘భలే మంచి రోజు’, ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి తదితర చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో సుధీర్ బాబు..టైగర్ ఫ్లాఫ్ నటించిన ‘భాగీ’ చిత్రంలో విలన్‌గా నటించి, బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు బాలీవుడ్‌లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ, తెలుగులో హీరోగా ఆఫర్లు రావడంతో సుధీర్ బాబు బీజీ అయ్యారు.

ఇక, ఇటీవలే విడుదలైన ‘బ్రహ్మాస్త’ చిత్రం.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో ‘బ్రహ్మాస్త్ర’లో నటించే అవకాశం వచ్చిందని, అయితే ఆ ఆఫర్ వదులుకోవడానికి గల కారణాలను తాజాగా సుధీర్ బాబు తెలియజేశారు.