పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగానే స్టార్ అన్పించుకున్నారు. ఎన్నో రోజులుగా విద్యార్థులు పోరాటం చేస్తున్నా..సాధ్యం కాని విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క రిక్వెస్ట్ తో సొల్యూషన్ చూపించారు. అమరావతిలోని వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు నష్టం కలిగిస్తున్న జివో నెం.64ను ఉపసంహరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అక్కడి విద్యార్థులు పవన్ ను కోరారు. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడుని రిక్వెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన బాబు వెంటనే జీవో నెం.64ను ఉపసంహరించుకున్నారు. దీనిపై చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పారు పవన్. ఇంత వరకు బాగానే ఉంది. ఇంతకు ముందు పవన్ బాబు చాలా విషయాలపై రిక్వెస్టులు చేశారు. అవి కూడా బాబుగారు పరిష్కరిస్తే బావుంటుందని అమరావతి జనాలు కోరుతున్నారు.