yoga poses will help to better romance life
mictv telugu

శృంగారంలో యాక్టివ్ గా ఉండాలంటే ఈ యోగాసనాలు వేయాల్సిందే…

November 25, 2022

  yoga poses will help to better romance life

ఆరోగ్యానికి యోగా చాలా అవసరం అవుతుంది. నిజానికి యోగా చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ మనం పొందొచ్చు. శారీరకంగా, మానసికంగా కూడా యోగా వలన ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. అలానే యోగా చేయడం వల్ల శృంగార జీవితాన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కేవలం యోగా వల్ల ఫిట్నెస్ మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. దీనివల్ల మన మనసు తేలిక అవుతుంది. మనలోని చైతన్యం పెరుగుతుంది.

యోగా చేయటం వల్ల మనం మన బాడీ చెప్పేది ఎలా వినాలి అనేది తెలుస్తుంది. మెదడుని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే యోగా చేస్తే శృంగార జీవితం కూడా అభివృద్ధి అవుతుంది.యోగా ఒత్తిడిని దూరం చేయడానికి సహాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనివల్ల కార్టిసోల్ లెవెల్స్ తగ్గుతాయి. మనలో ఒత్తిడి పెరగడం వల్ల శృంగార కోరికలు తగ్గిపోతాయి. డైలీ యోగా చేస్తే ఒత్తిడి దూరమై శృంగార కోరికలు పెరుగుతాయి. ఫ్లెక్సిబిలిటీతో పాటు ఓవరాల్ సెక్సువల్ ఫంక్షన్‌ని కూడా యోగా ఇంప్రూవ్ చేస్తుంది .

కపాలభాతి…

yoga poses will help to better romance life

ప్రాణాయామంలో ఇది ఎంతో ముఖ్యమైనది. దీని వలన బ్రీతింగ్ బాగుంటుంది. ఏకాగ్రతతో ప్రాణాయామం చేయడం ఎంతో అవసరం, అప్పుడూ సరైన ఫలితం వస్తుంది. శరీరం యాక్టివేట్ అయ్యేందుకు కపాలభాతి ప్రాణాయామ ఉపయోగపడుతుంది. ఊపిరితుత్తుల కెపాసిటీ పెరుగుతుంది. సెక్సువల్ లైఫ్‌కి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఎలా చేయాలంటే…ముందు ఒకచోట కదలకుండా ఒకచోట కూర్చోవాలి. తర్వాత చేతులను మోకాళ్ళ పైకి వచ్చేలా చేయండి.అలానే మీ అర చేతులు ఆకాశం వైపు ఉండేలా పెట్టాల్సి వుంది. తర్వాత గట్టిగా శ్వాస తీసుకోండి.బొడ్డు భాగాన్ని వెనుకకు నెట్టి మాత్రమే ఊపిరి వదలాలి.ఊపిరి వదిలే సమయంలో మీ కుడిచేయిని కడుపు భాగంపై పెట్టి అబ్డామినల్ మజిల్స్ ఎలా కాంట్రాక్ట్ అవుతున్నాయనేది గమనించాలి.రిలాక్స్ అవుతుంటే బొడ్డు, అబ్డామినల్ భాగాలు రిలాక్స్ అవుతాయి. దీనివల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. మన బీడీలోని స్ట్రెస్ ని కపాల భాతి రిలీఫ్ చేస్తుంది. శృంగారం చేయడానికి అనువుగా ప్రేరేపిస్తుంది.

ఉతథాన పృష్టాశన(లిజర్డ్ పోస్)….

రెగ్యులర్‌గా ఈ ఆసనం వేయడం వల్ల రొమాంటిక్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. శృంగారాన్ని ఎక్కువ సేపు చేయాలంటే ఈ యోగాశనం రోజూ వేయాల్సిందే అంటున్నారు నిపుణులు. దీనివల్ల మన బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇది ఎలా చేయాలంటే…మొదట రెండు కాళ్ళు రెండు చేతులపై బోర్లా పడుకోవాలి. తర్వాత ఒక పాదాన్ని ముందుకు పెట్టండి. తర్వాత చేతులు రెండు రెండు పక్కల ఉండేటట్లు చూసుకోండి. తర్వాత వెనక ఉండే మోకాళ్ళని కిందకు దించండి,మీయొక్క హిప్స్‌ని కిందకి ఉండేటట్లు చూసుకోండి. చెస్ట్ లిఫ్ట్ చేసినప్పుడు మోచేతులు కిందకి ఉంచటం మాత్రం మర్చిపోకండి.రెండు నిమిషాల పాటు శ్వాస తీసుకోండి. మీరు రెడీ అయినప్పుడు నెమ్మదిగా శ్వాసని వదలండి. ఇలా రోజుకు పదినిమిషాల పాటూ ఈ ఆశనాన్ని వేస్తే మంచిది.

ఆనంద బాలాసనం….

yoga poses will help to better romance life

ఈ ఆసనం వేయడం వలన సెక్సువల్ ఆర్గాన్స్ కి బ్లడ్ ఫ్లో అయ్యేలా చేస్తుంది. అలానే ఈ ఆసనం వేయడం వల్ల పొజిషన్స్ మీకు సులభంగా ఉంటాయి. శృంగార జీవితం బాగుండాలంటే ఈ ఆసనం కచ్చితంగా రోజూ వేయాల్సిందే అని చెబుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఈ ఆసనం బాగా హెల్స్ అవుతుందిట. దీనిని చేయడానికి మొదట మీరు వెన్నెముక నేల మీదకి ఉండేటట్టు పడుకోవాలి మీ మోకాళ్ళను కిందకి వంచండి.మీ పొట్ట దగ్గరికి మోకాళ్ళు రావాలి.
ఇప్పుడు మీ పాదాలను మీ చేతులతో తాకండి.మీ పాదాలు రెండూ దూరంగా ఉండాలి.మీ మోకాళ్ళను కూడా వైడ్‌గా ఉంచండి.మీ పాదాలని మీరు చేతులతో తాకినప్పుడు పైకి ఉండేటట్లు చూసుకోండి ఇలా ఈ విధంగా చేయడం వల్ల శృంగార జీవితం బాగుంటుంది.

శవాసనం….

yoga poses will help to better romance life

శవాసనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా మంది ఈ పొజిషన్ లో ఎక్కువసేపు ఉంటారు దీనిని అనుసరించడం వల్ల చాలా రిలాక్స్ గా ఉంటారు. అలానే ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. చక్కగా నేల మీద వీపు కిందకి ఉండేటట్టు పడుకుని శ్వాస తీసుకోండి. ఇలా చేస్తున్నప్పుడు కళ్ళని మూయండి. ఈ ఆసనం వేసినప్పుడు కాళ్లు చేతులు అన్ని కూడా రిలాక్స్ గా ఉంటాయి. ఐదు నిమిషాల పాటు శ్వాస తీసుకుంటూ వదలండి. ఈ వ్యాయామం వలన బాడీని రిలాక్స్ చేస్తాం. దీనివల్ల అనవసరమైన ఆలోచనలకు దూరం అవుతాము.

పన చెప్పిన ఆసనాలన్నీ పూర్తి ఏకాగ్రతతో చేయాలి. పూర్తిగా దాని మీదనే దృష్టి కేంద్రీకరించాలి. అసలు ఏ పని చేయాలన్నా ఫోకస్ అవసరం. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు చేస్తే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. అన్నటికన్నా ముఖ్యమైనది మన బుర్రను క్లియర్ గా ఉంచుకోవడం. మనదైనందిన జీవితంలో చాలా రకాల స్ట్రెస్ లతో బతుకుతున్నాం. ఎంతకాదనుకున్నా వాటిని భరించడం తప్పదు. ఏ పని చేస్తున్నా ఆ స్ట్రెస్ తో నే చేస్తున్నాం. కానీ తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, శృగారం చేసేటప్పుడు మాత్రం దీన్ని పక్కన పెట్టండి అని చెబుతున్నారు డాక్టర్లు. ఈ మూడు విషయాలు మనం బతకాడానికి చాలా అవసరం. ఎలాగో అలా బతికేద్దాం అనుకుంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు కానీ ఉన్న దాంట్లో ఆనందంగా బతకాలంటే తిండి, నిద్ర, సెక్స్ ఈ మూడు చాలా అవసరం అంటున్నారు. కాబట్టి ఎంత వీలయితే అంత ప్రశాంతంగా ఉంటూ, అలా ఉండడానికి అవసరమైన పనులు చేస్తూ హాయిగా జీవితాన్ని ఆనందించండి అని చెబుతున్నారు.