తన రాజకీయ జీవితంపై యోగీ సంచలన కామెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

తన రాజకీయ జీవితంపై యోగీ సంచలన కామెంట్

July 7, 2017

రాజకీయాల్లోకి వచ్చి వంద రోజులు అయిందో  లేదో అప్పుడే తన రాజకీయ జీవితం గురించి సంచలనం  ప్రకటన చేశారు యూపి సిఎం యోగీ ఆదిత్యనాధ్. ఈ రోజు మీడియాతో మాట్లాడిన  చానా విషయాల గురించి మాట్లాడారు. వంద రోజుల్లో ఎంతో  సాధించానని చెప్పారు. జనాలు…..కాబోయే ప్రధాన మంత్రి అయిన సోషల్ మీడియా  కోడై కూస్తున్నది. మరి  స్వామి వారెందుకు ఇట్లా సెలవిస్తున్నారో తెలియదు. వంద రోజుల్లో వంద కొత్త పనులు చేశారు. సంస్కరణ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పుకున్నారు.

మీడియాతో మాట్లాడిన  యోగీ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదన్నారు. తనపై నమ్మకం ఉంచి మోడీ, అమిత్ షా  ముఖ్యమంత్రిని చేశారని అన్నారు.  మరి కాబోయే ప్రధాని మీరే అట కదా అనే ప్రశ్నకు… సమాధానంగా  తాను రాజకీయ జీవితం గురించి ప్రస్తావించారు.

అసెంబ్లీ ఎన్నికల్ల పోటీ చేకుండనే   పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన యోగీ ఆదిథ్యనాథ్ పోటీకి సంబంధించిన ముచ్చట్ల చెప్పకుండా  ఈ ఉద్యోగం అయి పోయిన వెంటనే  మఠానికి వెళ్తానని అంటున్నారు.  సొంత పార్టీ నాయకులు తన పాలకు, తన ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారని అనుకున్నరో ఏమో మరి. వారం రోజుల్లనే పోలీసు అధికారిని బదిలీ చేయించేందుకు….. ఓ కలెక్టర్ ను బదిలీ చేయాలని ఏకంగా మంత్రే రాజీనామా చేస్తానని బెదిరించడం తలనొప్పిగా భావించినట్లుంది యోగీ. పైగా మోడీకి తనను ఆల్టర్ నేట్  అనే ప్రచారానికి బ్రేక్ ఇవ్వాలనే ఇట్లా అన్నారో తెలియదు.  అయితే  ఇవన్నీ పాలిటిక్స్ లో  సహాజమే కావొచ్చు కానీ… యోగీ కి కానట్లుంది. అందుకే  రాజకీయాలకో నమస్కారం పెట్టి మఠానికే వెళ్తానని అంటున్నట్లుంది.