యోగి 72 గంటలు,  మాయ 48 గంటలు నోరు మూయాలి - MicTv.in - Telugu News
mictv telugu

యోగి 72 గంటలు,  మాయ 48 గంటలు నోరు మూయాలి

April 15, 2019

దేశమంతా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తోంది. రాజకీయా నాయకులు పోటీ పడి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు మతపరమైన విమర్శలు చేస్తున్నారు. అలాంటి నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతిలపై ఎన్నికల సంఘం తాత్కాలిక నిషేధం విధించింది.

Yogi Adityanath Barred From Campaign For 72 Hours, Mayawati For 48 Hours

వీరిరువురు ప్రచారంలో భాగంగా మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ యోగి ఆదిత్యనాథ్‌పై 72 గంటలు, మాయావతిపై 48 గంటల తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిషేధం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం యోగి 3 రోజులు, మాయావతి 2 రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలి.