యూపీలో డెభ్బై ఏళ్ల తర్వాత యోగీ ఆదిత్యనాథ్ రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో డెభ్బై ఏళ్ల తర్వాత యోగీ ఆదిత్యనాథ్ రికార్డు

March 10, 2022

07

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రికార్డులను తన పేర నమోదు చేసుకోబోతున్నారు. అవేంటంటే… 1. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల నుంచీ యూపీలో ఒకసారి పూర్తికాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి రెండోసారి సీఎం అవడం ఇదే మొదటిసారి. 2. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం కూడా మొదటిసారే. 3. ముఖ్యమంత్రి అభ్యర్ధి నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం చాలా కాలం తర్వాత జరిగింది. ఇంతకు ముందు సీఎం అభ్యర్ధులు ఎమ్మెల్సీగానో, లేకపోతే సీఎం అయిన తర్వాత మండలికి ఎంపిక కావడం జరిగేది. గత ఎన్నికల్లో యోగీ ఆదిత్యనాథ్ ఎమ్మెల్సీగా ఉండి సీఎంగా పని చేశారు. కానీ, ఈ సారి యోగీ ఆదిత్యనాథ్‌ నేరుగా అసెంబ్లీకి పోటీ చేశారు. 4. నోయిడా సెంటిమెంట్ పటాపంచలు కావడం. గతంలో ఎవరైనా ముఖ్యమంత్రి హోదాలో నోయిడాలో పర్యటిస్తే అతన మరుసటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతాడని ఇప్పటి వరకూ యూపీలో సెంటిమెంట్‌గా ఉండేది. దానిని కూడా యోగీ బ్రేక్ చేశారు. తొలిసారి సీఎం అయినప్పటి నుంచీ దాదాపు 8 సార్లు ఆయన నోయిడాలో పర్యటించారు. 5. ప్రతిపక్షానికి వంద సీట్లకు పైగా రావడం చాన్నాళ్ల తర్వాత ఇదే మొదటిసారి. గతంలో ప్రధాన ప్రతిపక్షానికి 50కి మించి సీట్లు రాలేదు. కానీ, ఈ సారి సమాజ్ వాదీ పార్టీ దాన్ని అధిగమించి దాదాపు 100కు పైగా స్థానాల్లో విజయం సాధించే దిశగా సాగుతోంది.