అక్రమ సంబంధాల పురుషులను శిక్షిస్తాం.. సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ సంబంధాల పురుషులను శిక్షిస్తాం.. సీఎం

September 25, 2019

హిందువులతో సహా అక్రమ సంబంధాలు సాగించే పురుషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే పురుషులను శిక్షించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ చట్టం తీసుకొస్తుందని కూడా ఆయన వెల్లడించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దూమారం రేగుతోంది. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలంటూ సొంత పార్టీ నేతలు సహా రాజకీయ పక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి.  సీఎం యోగి అమాయకుడంటూ మరికొందరు కొట్టిపారేశారు. ఈ విషయమై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. ‘భార్య అనుమతి లేకుండా, భార్య నుంచి విడిపోయిన ఓ హిందూ వ్యక్తి అక్రమ సంబంధం కలిగి ఉంటే… అప్పుడు ఏ చట్టమూ ఏమీ చేయలేదు. భార్య ఫిర్యాదు చేసే వరకు అలాంటి వ్యక్తిని విచారించేందుకు చట్టం అనుమతిస్తుందని కూడా నేను అనుకోను. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయజాలదు. కేవలం కేంద్రం మాత్రమే చట్టం చేయగలదు’ అని స్పష్టంచేశారు.  

Yogi Adityanath.

అయితే యోగీ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ వ్యాఖ్యలను బట్టి సీఎం యోగి ఎంత అమాయకుడో తెలుస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఇదిలావుండగా మరో ఎన్సీపీ నేత మాజిద్ మీమన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో చట్టాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి.. చట్టాన్ని గౌరవించాలని హితవు పలికారు. కాగా, ట్రిపుల్ తలాక్ బాధితులకు తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వం తరపున సంవత్సరానికి రూ.6 వేల ఆర్ధిక సాయం అందజేస్తామని సీఎం యోగి ప్రకటించారు.