మీకో రూలు..మాకో రూలా ? ఏంది సారు ఇది...! - MicTv.in - Telugu News
mictv telugu

 మీకో రూలు..మాకో రూలా ? ఏంది సారు ఇది…!

July 10, 2017

వారెవ్వా ఉత్తర ప్రదేశ్ సియం అంటే సియం మే పోన్రి, ఏమాంటె యోగీ ఆదిత్య నాథ్ సారు సియం కుర్శి ఎక్కిండో అప్పట్నినుంచి..ఒకే ఒక్కడు సిన్మల ఒక్కరోజు ముఖ్యమంత్రి తీసుకున్నట్టే  నిర్ణయాలను టకా టకా టకా  తీసుకుంటుండు.మొన్న ఆ నడుమ కడ్పులున్న బిడ్డను లింగ నిర్ధారణ జేసే దవాఖాన్లను వట్టిస్తే 3 లక్షలు ఇస్తా అని పబ్లిక్కు బంపర్ ఆఫర్ ఇచ్చెనా..ఇగ రాష్ట్ర జనాభాను కంట్రోల్ వెట్టనీకి..కొత్తగ పెండ్లైనోళ్లకు..కండోమ్ లు,గర్బనిరోదక మాత్రలున్న కిట్టును ఇంటింటికి పంచుతా అని జెప్పెనా,ఇగ ఇప్పుడేమో గవర్నమెంట్ కొల్వులల్ల వయసు మీద వడిన ముసలోళ్లకు.. మూల్గే నక్కమీద తాడికాయ వడ్డంత బంపర్ ఆఫరిచ్చిండు,అదేంటిదంటే గవర్నమెంట్ కొల్వులున్న 50 ఏండ్లు నిండిన ముసలోళ్లు సరిగ పనిచేయకుంటే  కొల్వులకేలి పీకి పారెశి ఇంటికి తోలియ్యమని చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ కు ఫుల్లు ఆడర్ లిచ్చిన్రట,అంటే సారు దృష్టిల 50 ‍‍యేండ్ల లోపటున్నోళ‌్లంత మస్తు పని జేస్తున్రన్నట్టు,యువ నడివయసు అధికారులంత.. ఉద్యోగ ధర్మాన్ని వీడకుండా పబ్లిక్కు తక్లీబ్ జెయ్యకుండా నిస్వార్ధంతో నియమ నిబధ్దలతో పని జేస్తున్రు,పని దొంగలంతా 50 ఏండ్లు నిండిన ముసలోళ్లే ఉంటరు అని సారు మెంటల్గ ఫిక్స్ అయ్యిండేమో..గ ముచ్చట మాకెందుకు గనీ,మాదో శిన్న సలహా సారు…పబ్లిక్కు సమస్యలను పట్టిచ్చుకోకుండా..మేం గెలిస్తే మీకు అది జేస్తం ఇది జేస్తం అని జనాలను మాయజేసి..కుర్శీఎక్కినంక  పత్తలేకుండ కనవడని ఎమ్యెల్యేలను,మంత్రులను గుడ గాళ్ల పదవిలకేలి ఊశ్టింగ్ జేస్తిరంటే…మీకు పాలాభిషేకాలు జేశి…అచ్చేతాపకు గుడ మీకే గుద్దుతరు సారు పబ్లిక్ ఓట్లు.