35 లక్షల మంది కూలీలకు యూపీ సీఎం సాయం - MicTv.in - Telugu News
mictv telugu

35 లక్షల మంది కూలీలకు యూపీ సీఎం సాయం

March 21, 2020

Yogi Announced To Send Money For Daily Needs

కరోనా ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు, రోజువారి కూలీలపై ప్రభావం పడకుండా ఉండేందుకు సాయం ప్రకటించింది. దాదాపు 35 లక్షల మంది రోజువారి కూలీలకు నిత్యావసరాల కోసం రోజుకు రూ. 1000 ఇవ్వనున్నట్టు వెల్లడించారు.  చాలా మంది ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రభుత్వాలు ఆదేశిస్తున్న సమయంలో పేదలకు ఇది ఇబ్బంది కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు నెల రోజులకు సరిపడా రేషన్ కూడా సరఫరా చేయాలని ఆదేశించారు.

యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 15 లక్షల మంది రోజువారి కూలీలు,20.37 లక్షల మంది భవన నిర్మాణ రంగం కార్మికులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కాగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 23 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 9 మంది కోలుకున్నారు. ఇంకా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచిస్తోంది. అవసరముంటేనే బయటకు రావాలని చెబుతోంది. దీంతో దినసరి కూలీల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ క్రమంలోనే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.