Yogi Babu : MS Dhoni gifts self-autographed bat to Comedian Yogi Babu
mictv telugu

ప్రముఖ కమెడియన్‌కు ధోని బ్యాట్ గిఫ్ట్..

February 16, 2023

Yogi Babu : MS Dhoni gifts self-autographed bat to Comedian Yogi Babu

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంస్ ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్లర్లేదు. సామాన్యులు నుంచి సెలబ్రిటీస్ వరకు ధోనిని అభిమానించిన వారిలో ఉన్నారు. ఇక ఐపీఎల్‌లో మిస్టర్ కూల్ చెన్నైకు సేవలు అందిస్తుండడంతో తమిళనాడుకు చెందిన అభిమానులు ధోనికి మరింత దగ్గర అయిపోయారు. ప్రముఖ కమెడియన్ యోగిబాబు కూడా ధోనికి వీరాభిమాని. చెన్నైలో జరిగిన ప్రతీ సీఎస్కే మ్యాచ్‌లకు యోగిబాబు హాజరయ్యేవాడు. కేవలం ధోనిని చూసేందుకు మాత్రమే వచ్చేవాడు. ఈ క్రమంలోనే పలుమార్లు ధోని ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నించి విఫలం చెందాడు.

తాజాగా యోగిబాబుకు ధోని నుంచి అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది. ధోని స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను యోగిరాజుకు బహకరించాడు.దానిపై బెస్ట్ విషెస్..యోగిబాబు రాశాడు. ధోని నుంచి బహుమతి అందుకున్న యోగిబాబు ఆనందలో మునిగితేలుతున్నాడు. ఆ బ్యాట్ పట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తున్నాడు.తాజాగా తాను నటిస్తున్న సినిమా టీంతో యోగిబాబు బ్యాట్ పట్టుకొని తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.