ప్రేమ నువ్వే, నా గుండె చప్పుడు నువ్వే: కాజల్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమ నువ్వే, నా గుండె చప్పుడు నువ్వే: కాజల్

June 14, 2022

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఫోటోను వీక్షిస్తున్న నెటిజన్స్, హీరోయిన్లు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ, దీవిస్తున్నారు. ఇంతకి ఆ ఫోటో ఏమిటీ? ఎవరు ఉన్నారు ఆ ఫోటోలో అనే వివరాల్లోకి వెళ్తే.. గతకొన్ని నెలలుగా కాజల్ అగర్వాల్ సినిమాలకు దురంగా ఉంటున్న విషయం తెలిసిందే. అందుకు కారణం..ఆమె గర్భం దాల్చడం కారణంగా సినిమాలకు బ్రేకిచ్చింది. ఓ భర్తతో వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ, మరోవైపు గర్భం ధరించిన తర్వాత ఎలా ఉంటుంది అనే వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంది.

 

ఈ క్రమంలో ఇటీవలే కాజల్, కిచ్లూ దంపతులకు మగ పిల్లవాడు జన్మించాడు. ఆ చిన్నారికి నీల్ అని పేరు పెట్టుకొని, తన జీవితంలోని ఆనంద క్షణాల్ని అనుభవిస్తోంది. కానీ, ఇంతవరకూ కాజల్ తన బిడ్డ ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. తాజాగా కాజల్ అగర్వాల్ తన కొడుకు నీల్ కిచ్లూని ముద్దాడుతూ, ఓ క్యూట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నా జీవితంలోని ప్రేమవు నువ్వే, నా గుండె చప్పుడివి నువ్వే’అనే కేప్షన్ పెట్టింది. ఆ ఫోటోలో నీల్ ముఖం మాత్రం పూర్తిగా కనిపించటం లేదు.

కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఆ ఫోటోపై హీరోయిన్ కీర్తి సురేశ్ ఓ మై గాడ్ అంటూ రిప్లై ఇచ్చింది. రాశీఖన్నా లవ్ ఎమోజీస్‌తో రిప్లై ఇచ్చింది. ఇక అభిమానులైతే దివెనల మీద దివెనలు చేస్తూ, కామెంట్స్ చేస్తున్నారు.