నెంబరు సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టొచ్చు - Telugu News - Mic tv
mictv telugu

నెంబరు సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టొచ్చు

June 14, 2022

ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అందులో ప్రతీ ఒక్కరూ వాట్సాప్ ఆప్‌ను ఖచ్చితంగా వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనం ఎవరికైనా మెసేజ్ చేయాలంటే వారి నెంబరును కాంటాక్ట్ లిస్టులో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు కొందరికి ఒక్కసారే వాట్సాప్ చేయాల్సిన పరిస్థితులు ప్రతీ ఒక్కరికీ ఎదురై ఉంటుంది. అలాంటప్పుడు వారి నెంబరుని సేవ్ చేసుకోవడం అనేది సమస్యగా మారుతుంది. దీంతో దీనికి పరిష్కారంగా నిపుణులు ఒక పద్ధతిని సూచిస్తున్నారు. దాని ద్వారా నెంబరు సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో మేసేజులు, ఫోటోలు, వీడియోలు పంపవచ్చు. అదెలాగంటే.. ముందు ఫోన్‌లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్‌లో https://wa.me/91 అని టైప్ చేసి స్పేస్ ఇవ్వకుండా ఫోన్ నెంబరు కలిపి సెర్చ్ చేసి ఓకే చేయండి. అప్పుడు వెంటనే ఆ నంబరుతో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం పంపాల్సిన వాటిని పంపుకోవచ్చు. దీనివల్ల కాంటాక్ట్ లిస్టు పెరగకుండా ఉంటుందని టెకీలు సూచిస్తున్నారు.