You Can Plan Mini Vacations Around These Dates next Year
mictv telugu

వచ్చే సంవత్సరంలో లాంగ్ వీకెండ్స్.. ఇలా ప్లాన్ చేసుకోండి!

November 23, 2022

You Can Plan Mini Vacations Around These Dates next Year

సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగులకు.. వచ్చే సంవత్సరం సెలవుల లిస్ట్ వచ్చేసింది. మరి వచ్చే సంవత్సరానికి విహార యాత్రలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చేయకపోతే ఈ ప్రాంతాల వైపు ఓ లుక్కేయండి.
ఇంకో నెల గడిచిపోతే పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి.. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. ప్రతీ సంవత్సరంలాగే.. ఈ సంవత్సరం కూడా చాలా సెలవులు వచ్చేస్తున్నాయి. 12 నెలల్లో 21 లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. వాటిని పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే ఆ వెకేషన్స్‌ని ఆనందంగా గడిపేయొచ్చు. ఒకేసారి అన్నిప్రాంతాను చుట్టేయకపోయినా అందులో కొన్నిటినైనా టచ్ చేయొచ్చు. పైగా ఒకే నెలలో ఒకే ప్రాంతాన్ని చుట్టేయాలనేమీ లేదు. కొన్నిసార్లు ఆ ప్రాంతం మరొక నెలలో కూడా అందంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి.

జనవరి

జనవరిలో.. అహ్మదాబాద్, గుజరాత్ ప్రాంతాల్లో ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ జరుగుతుంది. అంతేకాదు.. రాజస్తాన్ లో ‘బికనీర్ క్యామిల్ ఫెయిర్’, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో స్కైంగ్ ట్రిప్ కూడా ఉంటుంది. ఉత్తరాఖండ్, గుజరాత్లో తెల్లని ఎడారికి మీకు ఈ నెల ఆహ్వానం పలుకుతుంది.

ఫిబ్రవరి

ఈ నెలలో పార్టీలకు నెలవైన గోవాలో గడిపేయొచ్చు. ఆగ్రా, అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్, ఉదయ్‌పూర్, రాజస్థాన్, వారణాసి పాత పట్టణాలను సందర్శించొచ్చు. అంతేకాదు.. మధ్యప్రదేశ్‌లోని ఖజరహోని కూడా చూసేయండి.

మార్చి

మార్చిలో హోలీ వస్తుంది. కాబట్టి మధురలోని వ్రిందావన్ ప్రాంతానికి వెళ్లొచ్చు. ఈ నెలలో ఊటీ చూడడం కూడా బెస్ట్ చాయిస్. రాజస్థాన్‌లోని వైల్డ్ లైఫ్‌ని చూడొచ్చు. సిక్కింలోని ప్రశాంత వాతావరణాన్ని, తీర్థయాత్ర కోసం మౌంట్ అబు, ప్రకృతి దృశ్యాల కోసం హంపికి వెళ్లండి.

ఏప్రిల్

జమ్మూకశ్మీర్ ఈ సమయంలో వెళ్లడానికి మంచి ప్రదేశం. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ నేషనల్ పార్క్, గొప్ప వారసత్వ సంపద కోసం ఉదయ్‌పూర్, ట్రెక్కింగ్ కోసం వెళ్లడానికి కొడైకెనాల్, స్కీయింగ్ కోసం గుల్మర్గ్, అస్సాం, నాసిక్, నీలి సముద్రాల కోసం లక్షద్వీప్, స్వచ్ఛమైన గాలి కోసం కూర్గ్ వరకు వెళ్లి రండి.

మే

రిషికేష్, ఉత్తరాఖండ్, కొడైకెనాల్, తమిళనాడు, మస్సూరీ, స్పిట్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఊటీ, తమిళనాడు, కేరళ, ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్‌లను ఈ నెలలో చూసి రావడానికి మంచి ఆప్షన్.

జూన్

ఈ నెలలో పూరీ రథయాత్ర జరుగుతుంది. అది చూడడానికి ఒడిశా వరకు వెళ్లి రావచ్చు. పర్వతారోహకులకు.. స్పిటీ వ్యాలీ, ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు అనువుగా ఉంటాయి.

జూలై

లడఖ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, అమరనాథ్ యాత్ర, జమ్మూకశ్మీర్, ధర్మశాల ప్రాంతాలు వెళ్లడానికి ఈనెల ప్లాన్ చేయండి.

ఆగస్టు

ఈ నెలలో కృష్ణాష్టమి ఉంది. మధురలోని వ్రిందావన్కి వెళ్లొచ్చు. పైగా వర్షాకాలం మొదలవుతుంది. కాబట్టి ప్లాన్ చేసేటప్పుడు అన్ని చెక్ చేసుకోండి. కూనూర్, తమిళనాడు, చిరపుంజి, మేఘాలయ, లడఖ్, మౌంట్ అబు, రాజస్థాన్ ప్రాంతాలను సందర్శించొచ్చు.

సెప్టెంబర్

నదుల కలయికల అందమైన ప్రాంతం నైనిథాల్ ఈ నెలలో చాలా అందంగా కనిపిస్తుంది. బుండీ, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్, అప్తానీ తెగ చూడడానికి జైరో వ్యాలీ వరకు వెళ్లిరండి.

అక్టోబర్

కలకత్తా, మైసూర్లో దసరా ఉత్సవాలను చూసి రండి. నైనిథాల్, ఆగ్రా వెళ్లి.. తాజ్‌మహల్‌ని తాకిరండి. వారణాసి, పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ వెళ్లొచ్చు. ఇక్కడ ఏనుగు సవారీ బాగుంటుంది.

నవంబర్

గురునానక్ జయంతి సందర్భంగా అమృత్‌సర్‌కి వెళ్లి గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకోండి. రాజస్తాన్‌లోని పుష్కర్ ఫెయిర్, గోవాలో రాత్రి జీవితం చూసి తీరాల్సిందే! భరత్‌పూర్‌లో పక్షుల కిలకిలారావాలు, పశ్చిమ బెంగాల్లో పులులను, మనాలీలో మంచును చూడాల్సిందే!

డిసెంబర్

కబినీలోని వన్యప్రాణుల అభయారణ్యం, కర్ణాటక, ఉత్తరాఖండ్‌లోని ఔలికి స్కీయింగ్ ట్రిప్, కచ్, గుజరాత్ ఇలా అన్ని ప్రాంతాలతో సంవత్సరాన్ని అందంగా ముగించేయొచ్చు.