మీకంటూ ఓ ఆలోచనే ఉండదా..... - MicTv.in - Telugu News
mictv telugu

మీకంటూ ఓ ఆలోచనే ఉండదా…..

August 10, 2017

ఎవరు ఎందుకు ఆందోళన చేస్తున్నారో… వారి అస్సలు ఉద్దేశ్యాలు ఏమిటో… తెలుసుకునే ఆలోచనలో ప్రభుత్వాలు    లేవు. పైగా న్యాయన్యాయాల ఆలోచనే లేకుండా కొన్ని సార్లు నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే కొన్ని సార్లు  మంచి విషయాల కోసం ఆందోళన చేస్తున్న వారి గురించి అస్సలు పట్టించుకోవు ప్రభుత్వాలు.

ఆ మధ్య రైతులు  మధ్యప్రదేశ్ లో తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. మహారాష్ట్రలోనూ ఉద్యమించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్ని సార్లు సావధానంగా చెప్పినా పట్టించుకోని పాలకులు రోడ్లపైకి రాగానే… విధ్వంసాలు చేయగానే దానికి  పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు చేస్తాయి. ఇట్లా ఒక్క సారి అని కాదు ఒక్కరాష్ట్రం అని కాదు. జనాలు ఆందోళన చేసి…. రోడ్లపైకి వస్తే గాని  ఓ  సమస్య ఉందని.. దాన్ని పరిష్కరించాలనే ఆలోచన గాని ప్రభుత్వాలకు  ఉండటం లేదు.

తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో మరాఠాలు చేస్తున్న ఆందోళనకు జడుసుకుని వారిపై వరాల జల్లు కురిపించింది. మరాఠా పిల్లలకు విద్యా రంగంలో రాయితీలు ఇస్తామని చెప్పింది. హాస్టళ్ల నిర్మాణం కోసం  స్థలాలు ఇస్తామని చెప్పింది. ఇవన్నీ వేలాది మంది మరాఠాలు రోడ్లపైకి వచ్చిన తర్వాత చేసింది.

దాని కంటే ముందే దీనిపై స్టడీ చేసి… మరాఠాల సమస్యలు ఏమిటి. వారి డిమాండ్లల్ల ఉన్న న్యాయం ఏమిటి. బిసీలు, ఓబీసీలకు ఇచ్చినట్లే వీళ్లుకు  ఎందుకు  రాయితీలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకూడాదనె ఓ సైంటిఫిక్ థాటే లేదు. అట్లా చేయాలనే ఆలోచనే లేదు. అక్కడ డామినెట్ క్యాస్ట్ గా ఉన్న మరాఠాలు  అంతో ఇంతో అన్ని రంగాల్లో ముందున్న వారే. వారు ఆందోళన చేస్తున్నారు కాబట్టి వారి డిమాండ్లు నెర వేరుస్తామని అంటున్నారు. సమస్యలపై, డిమాండ్లపై నిర్ధిష్టైమైన, సమగ్రమైన ఆలోచన కుండా ప్రభుత్వాలు నడిస్తే…. కోరికలు.. డిమాండ్లు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. అస్సలైన వారికి, అర్హులకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తించాలి.