వీటి ఎక్స్ పైరీ డేట్ తెలుసా?  - MicTv.in - Telugu News
mictv telugu

వీటి ఎక్స్ పైరీ డేట్ తెలుసా? 

September 2, 2017

మనం రోజూ వాడే వస్తువుల్లో చాలావాటికి తయారీ  తేదీ, ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది. కానీ కొన్ని వస్తువులకు ఎక్స్ పైరీ తేదీ ఉండదు . ఎక్స్ ఫైర్ తేదీ ముగిసిన వస్తువును వాడకూడదన్న సంగతి మనకు తెలుసు. వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయి. మరీ ఎక్స్ పైరీ తేదీ లేని వస్తువులను గుర్తించడం ఏలానో  తెలుసుకుందాం.

  1. టవల్

స్నానానికి ఉపయోగించే టవల్ జీవిత కాలం1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు. శుభ్రంగా వాడుకుంటే 3 సంవత్సరాలు వాడుకోవచ్చు. ఎక్కువగా వాడుకునే వాళ్లు 1 సంవత్సరం వాడుకుంటే మంచిది. లేదంటే దానిపై బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లు ఉండి  ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

 

  1. చెప్పులు

సాదారణంగా చెప్పులను  6 నెలల కంటే ఎక్కువ కాలం వాడకూడదు. వాడితే  ఫంగస్ ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.

  1. బాత్ స్పాంజ్…

దీన్ని రెండు వారాలకు మించి వాడకూడదు. వాటిలో బ్యాక్టిరీయా, వైరస్ ఉండే అవకాశం ఉంటుంది కనుక కొత్త వాటిని వినియోగించాలి.

  1. షూస్…

రెగ్యులర్ గా వాడితే 1ఏడాది మించి వాడకూడదు. షూస్ లో కుషన్ కోల్పోయి పాదాలపై భారం పడుతుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ లు ఉంటాయి . దాంతో అనార్యోగ సమస్యలు ఏర్పడుతాయి.

  1. తలదిండ్లు..

జీవిత కాలం 2 నుంచి 3 సంవత్సరాలు. ఆ తరువాత వాటిలో ఉండే కుషన్ పోతుంది. దాంతో మెడ నొప్పి వస్తుంది.

     6.దువ్వెన…

చాలా మంది దువ్వెన ను ఏళ్లకు ఏళ్లు వాడేస్తారు. కానీ 1 ఏడాది మించి వాడరాదు. దువ్వెనను మార్చడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.