టెన్త్ పాసయితేనే ‘కల్యాణమస్తు’ లబ్ది.. ఎందుకో వివరించిన సీఎం జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

టెన్త్ పాసయితేనే ‘కల్యాణమస్తు’ లబ్ది.. ఎందుకో వివరించిన సీఎం జగన్

September 26, 2022

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం మహిళా శిశు సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. అందులో మహిళలు, పిల్లల విషయంలో మేలు చేకూర్చే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం జగన్ సమర్ధించుకున్నారు. అలాగే పదవ తరగతి పాసయితేనే ఈ పథకం కింద లబ్ది పొందుతారనే నిబంధనను ఎందుకు తీసుకొచ్చారో వివరించారు. పథకం ప్రకారం.. కల్యాణ మస్తు పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు,

ఆమెను పెళ్లి చేసుకునే వరుడు కచ్చితంగా పదవ తరగతి పాసయి ఉండాలనే నిబంధన తీసుకొచ్చారు. ఈ నిబంధన వల్ల రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టడం సాధ్యమవుతుందని జగన్ పేర్కొన్నారు. అటు ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనురాధ తదితరులు పాల్గొన్నారు. అయితే టెన్త్ చదివి పాసవని వారి పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.