Young birds feeding older who are unable to search for food.. Viral Video
mictv telugu

ఈ పిచ్చుకల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.. వీడియో వైరల్

May 19, 2022

Young birds feeding older who are unable to search for food.. Viral Video

ప్రకృతిలో పుట్టుక, చావు అనే రెండు ఘటనలు ఏ జీవికైనా సహజం కానీ.. ఆ రెండింటి మధ్య ఓ ఉన్న జీవితం పరులకు కూడా సహాయపడితే ఆ జన్మకొక పరమార్ధం ఉంటుంది. మనుషుల్లో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అది. చిన్ననాటి గురువులే కాదు ప్రకృతి కూడా అలాంటి పాఠాలు నేర్పుతుంది.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అది నిజమని చెప్పక మానరు. అడవిలో ఆహారాన్ని సేకరించుకోలేకపోతున్న ముసలి పక్షికి, కొన్ని చిన్న పిచ్చుకలు ఆహారాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఆకలితో ఉన్న పెద్ద పక్షులకు చక్కగా ఆహారాన్ని నోటికి అందిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జీవన సూత్రం ఇదేనంటూ, అద్భుతం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ వీడియోను హరి చందన (ఐఏఎస్‌) ట్విటర్‌లో షేర్‌ చేశారు.