ఫోన్ పోయిందని ఆత్మహత్య.. కామారెడ్డిలో విషాదం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ పోయిందని ఆత్మహత్య.. కామారెడ్డిలో విషాదం..

May 14, 2019

స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్న ఓ యువకుడు రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మచారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో నివాసముండే అశోక్ (17) తల్లి జయమ్మకు సాయంగా కూలీ పనులకు వెళ్తున్నాడు.  అలా వచ్చిన డబ్బులతో అశోక్‌కు జయమ్మ ఓ ఖరీదైన ఫోన్ కొనిచ్చింది.

Young Boy Suicide For Lost His New Mobile At Kamareddy District Machareddy Sc Colony.

అయితే ఆ ఫోన్‌ను అశోక్ సోమవారం పొగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అశోక్ బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. అది గమనించిన అశోక్ తల్లి ఆస్పత్రికి తరలించారు.  కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికొచ్చిన అశోక్.. తల్లి జయమ్మ బయటకు వెళ్లడంతో ఇంట్లో చీరతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి కన్నీరుమున్నీరు అవుతుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.