హీరో విశ్వక్ సేన్, టీవీ 9 యాంకర్ నాగవల్లి మధ్య జరిగిన వివాదం ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఈ గొడవపై చాలామంది హీరో విశ్వక్సేన్ కు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సైతం.. విశ్వక్ కు తన మద్ధతు తెలుపుతూ టీవీ 9 పై సంచలన కామెంట్స్ చేశాడు. టీవీ9 వాళ్ళు న్యూస్ తప్ప మిగతా అన్నీ చూపిస్తారని, వాళ్ళకి ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తుంటాయంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇంకా ఆ ట్వీట్ లో .. టీవీ 9 నీచ స్వభావం గురించి ఏ ఒక్కరూ మాట్లాడరని డైరెక్ట్ గా అధికారిక టీవీ9 హ్యాండిల్ ని ట్యాగ్ చేసి మరీ చెప్పాడు.
అవసరమైనవి వదిలి, పనికిమాలిన విషయాలను టెలికాస్ట్ చేసి నాన్సెస్ క్రియేట్ చేస్తారన్నాడు. తనకు ఆ ఛానెల్‌తో ప్రాబ్లెమ్ ఉందన్నాడు. ప్రజల కోసం ఎలాంటి ఉపయోగపడే ఆ చానెల్ ఎలాంటి వార్తలు చూపించకపోవడం సిగ్గు చేటు అంటూ షాకింగ్ కామెంట్స్ తాను చేసాడు. తాను విశ్వక్ సేన్ కి పూర్తి మద్దతు ఇస్తున్నానని సంచలన కామెంట్స్ చేశాడు.