అద్దెకు ఇల్లు కావాలంటూ.. అక్క‌డే కానిచ్చేశారు - MicTv.in - Telugu News
mictv telugu

అద్దెకు ఇల్లు కావాలంటూ.. అక్క‌డే కానిచ్చేశారు

May 3, 2022

 

ఇల్లు అద్దెకు కావాలని చెప్పి… ఇంట్లోకి ప్రవేశించిన ఓ జంట‌.. దొరికిందే చాన్స్ అంటూ రెచ్చిపోయారు. శృంగారం చేస్తూ ఇంటి యజమానికి అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన హైదరాబాద్‌ లోని ఎస్‌ఆర్ నగర్‌ లో చోటు చేసుకుంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బి.కె గూడాలో ఓ ఇంటికి టు లెట్ బోర్డు ఉండడంతో ఓ జంట అక్కడికి వచ్చారు. తాము భార్యాభర్తలమని అద్దె ఇల్లు కావాలని అడిగారు. ఇల్లు చూస్తామని రెండవ అంతస్తులోని గదిలోకి వెళ్లారు. అయితే ఎంతసేపైనా ఆ జంట‌ కిందికి రాకపోయే సరికి ఇంటి యజమానికి అనుమానం వచ్చి, సెకండ్ ఫ్లోర్ కు వెళ్లి చూడ‌గా ఇద్ద‌రూ రాసలీలల్లో మునిగిపోయి ఉన్నారు. ప్ర‌పంచంతో సంబంధం లేద‌న్న‌ట్లుగా సరసాలాడుతూ కనిపించారు. దీంతో ఓనర్ వారి పాడు పని చూసి ఆగ్రహించాడు. వారిపై గ‌ట్టిగా అరిచాడు. ఎక్కడ పట్టుకుంటారోనన్న భయంతో యువతీ, ఆ వెనుకే బైక్‌పై యువకుడు బయటికి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఇంటి ఓన‌ర్ సీసీ ఫుటేజీ లతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.