మెట్రో రైలులో రెచ్చిపోయిన ప్రేమ జంట..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో రైలులో రెచ్చిపోయిన ప్రేమ జంట..వీడియో

December 8, 2019

Delhi Metro, 01

కొన్ని నెలల క్రితం హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో ప్రేమ జంటలు రెచ్చిపోయి రొమాన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. లిఫ్ట్ సీసీటీవీలో రికార్డు అయిన ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయి అందరి ముందే ముద్దులు పెట్టుకుంది. 

పట్టపగలు.. సోయి లేకుండా..రోమాన్స్‌లో మునిగిపోయారు. దీంతో తోటి ప్రయాణికులకు ఎంతో ఇబ్బందిని కలిగించారు. ఇద్దరి భాగోతాన్ని ఓ ప్రయాణికుడు రహస్యంగా చిత్రీకరించాడు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. దేనికి సంబందించిన వీడియో ప్రసతుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ మెట్రో రైల్ అధికారులు స్పందించారు. ఆ జంటను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.